రైతు కష్టం
అకాల వర్షాలు పాడడం తో భూమి పచ్చగా ఉందని ఊళ్ళో వాళ్ళు అందరూ ఎదో ఒక్క పంట వెయ్యడం మొదలు పెట్టారు. లచ్చన్న అనే రైతు కష్టపడే తత్వం కలవాడు కాబట్టి ఆ పది వేలతో నువ్వుల (Sesame seeds) పంట వేసాడు. పాపం విధి లచ్చన్నని పగా పట్టిందేమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి. ఎందుకంటె, అయన పంట వేసిన తరువాత ఒక్కసారి కూడా వర్షం పడలేదు. నువ్వుల పంట పొడి పంట కాబట్టి పొలం లో ఉన్న తడితో మొలకెత్తింది. ప్రతి రోజు పొలం దగ్గరికి వెళ్ళి ఆకాశం దిక్కు చూస్తూ మొక్కుతున్నాడు. కానీ విధీ అతన్ని కనికరించలేదు. రోజు రోజుకు మొక్కలు ఎండి పోతున్నాయి. ఏం చెయ్యాలో తెలియదు. మొక్కలు చూస్తూ ఏడుస్తూ ఉన్నాడు. తన తల్లి చనిపోయిన కూడా అంతలా ఏడవంతా ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు. అల ప్రతి రోజు వెళ్ళటం ఆకాశాన్ని ప్రార్థించటం, బాధపడటం మల్లి ఇంటికి రావటం. ఎందుకంటె లచ్చన్న కు పంట మీద ఉన్న ప్రేమ అలాంటిది. ఎండ కాలం రానే వచ్చింది. భానుడి తాపానికి పాపం పసి మొక్కలు నిలువలేక పోయాయి. పంట చచ్చిపోయిది. అంటే లచ్చన్న ఒక్క సంవత్సరం లో సంపాదించినా సంపాదన సున్నా(0). చేసేది ఏమి లేక 100 రోజుల పని ఉంటె దానికి వెళ్తూ జీవనం సాగిస్తూ ఉన్నాడు.
అంతలోనే ఒక్క శుభవార్త....!, పెద్దకూతురికి పెళ్లి కుదిరింది. మంచి పెద్దింటి, మర్యాద పూర్వక కుటుంబం సంబంధం మరియు అబ్బాయి కి ప్రభుత్వ ఉద్యోగం ఉంది. నేను ఎప్పటినుండో కష్టపడుతూ నా బిడ్డలను కూడా కష్టపెడుతూ ఉన్న కనీసం ఇప్పుడన్నా ఒక్క మంచి కుటుంబం లో నా బిడ్డ అడుగు పెడితే మంచిగా బ్రతుకుతుందనుకొని ఈ సంబంధం ఎలాగైనా కుదుర్చుకోవాలనుకున్నాడు. లచ్చన్న కు ఈ సంబంధం వాదులుకోవడం ఇష్టం లేదు. కానీ, చేతిలో చిల్లి గవ్వ లేదు పెళ్లి చెయ్యడానికి.... అబ్బాయి వాళ్ళు అందరికి నచ్చిండ్రు. కానుకలుగా మొత్తం 5 లక్షలు అడిగారు. ఏం చెయ్యాలో అర్థం కాకా.... ఊళ్ళో కొందరి దగ్గర అప్పుగా తీసుకున్నాడు. పెళ్లి చేసాడు.
ఇప్పుడు మొదలయింది అసలయిన కష్టం లచ్చన్నకు.అప్పు... అప్పు.... అప్పు.... ఎలా తీర్చాలో తెలియట్లేదు. మల్లి జూన్ లో బ్యాంకు లో వడ్డీకి పైసల్ తీసుకొని పంట వేసాడు. మల్లి విధి కాటేసింది. వర్షాలు పడట్లేదు... ఊళ్ళో వాళ్ళ అందరి పరిస్థితి అలాగే ఉంది. కానీ లచ్చన్న పరిస్థితి మాత్రం ఇంకా చాల దీన స్థితి లో ఉంది. ఒక్క పక్క పెళ్లి కి చేసిన అప్పు ఇయ్యకపోతే ఇల్లు తీసుకుంటారు మరియు ఇంకో పక్క బ్యాంకు లో తీసుకున్న loan ఇయ్యకపోతే పంట పొలం తీసుకుంటారు... చాల తికమకలో ఉన్నాడు. పంట చేతికి వచ్చేలా లేదు మొత్తం ఎండి పోవడం మొదలయింది. ఏం చెయ్యాలో అర్థం కాలే... దెబ్బ మీద దెబ్బ పడ్తూనే ఉంది లచ్చన్నకు .అదే సమయం లో లచ్చన్నకు రాకూడని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన తన మంచిదా...! కదా...! అని కూడా ఆలోచించకుండా అమలు పర్చడానికి ముందుకెళ్లాడు. ఒక్కటి గుర్తుంచుకోండి... మనం ఏం ఆలోచించిన అందులో మనకు మరియు మనతో ఉన్న వాళ్లకు మంచి జరగపోయిన పర్లేదు కానీ చేడు కానీ దుఃఖం కానీ జరిగే విధంగా ఉండకూడదు.....దయచేసి గమనించండి. లచ్చన్న కు వచ్చిన ఆలోచనను రైతులందరూ అవలంబించితే.... అన్నం పెట్టడానికి ఒక్క రైతు కూడా మిగలడు. అలాగే ఈ ప్రపంచం లో ఏ ఒక్క మనిషి కూడా బ్రతికి బట్ట కట్టలేడు.
గమనించండి మిత్రులారా....!, లచ్చన్న చనిపోవడం తోనే సమస్య అనేది పరిష్కరింపపడలేదు. అతను చనిపోవడం వల్లే అతను మోస్తున్న బరువు అతని కుటుంబం మోస్తుంది. లచ్చన్న కు వచ్చిన ఆలోచన ప్రతి చిన్నకారు రైతుకి రావడం సహజమే ఎందుకంటె మన చుట్టూ ఉన్న ప్రపంచం ఆలా ఉంది మరి. రైతులు పోరాటం చేస్తే దాన్ని అణగదొక్కే శక్తులు చాలా ఉన్నాయి. దయచేసి రైతులకు చేతనైనంత సహాయం చెయ్యండి. ఇలాంటి ఆలోచన ఏ రైతుకి రాకుండ చెయ్యండి. రైతు అనేవాడు దేశానికి వెన్ను ముక్క అని అంటారు కానీ నేను "రైతు అనే వాడు దేశనికి ఊపిరి " అని నమ్ముతాను. రైతు లేకుండా దేశం ఆర్థికంగా నిలబడొచ్చేమో కానీ అన్నం లేకుండ దేశం లో ఉండే ఏ వ్యక్తి నిలబడలేడు. ఒక్కో వ్యక్తి సముహంల మారి కొన్ని సమూహాలను కలిపి ఒక్క దేశంగా ఏర్పడుతుంది. ఒక్క వ్యక్తే నిలబడనప్పుడు ఇక దేశం ఎలా నిలబడుతుంది.
By