భారమైన గుండె
గమనిక: నిజ అనుభవం బేస్ చేసుకొని రాసిన కధ ఇది. అమ్మాయి పెఋ మాత్రం పేర్కొనలేకపోతున్నాను ఫ్రెండ్స్.
హాయ్ ఫ్రెండ్స్!! అది 2018 వ సంవత్సరము. ఒక అమ్మాయి INSTAGRAM లో పరిచయం అయ్యింది. మాది ఖమ్మం. మా నాన్న సింగరేణి లో జాబ్ చేస్తుంటాడు. మాది మద్య తరగతి కుటుంబం. అప్పటికీ నా ఇంజినీరింగ్ డిప్లొమా పుతి అయిపోయింది. అమ్మాయి వాళ్ళది కొత్తగూడెం. వాళ్ళ నాన్న కూడా సింగరేణి ఉద్యోగరీత్యా కొత్తగూడెం లో ఉంటున్నారు. అమ్మాయి ఇంటర్ చదువుతుంది.నాకు అప్పటికి ప్రేమ మీద కొంచెం కూడా నమ్మకం లేదు అయినప్పటికీ తన పరిచయం చాలా కొత్తగా అనిపించింది.వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న పెద్ద worst అని చెప్పి నాతో తన బాధలు చెప్పేది. వాళ్ళ అమ్మతో తరుచూ గొడవ పడుతూ బాధ పెడ్తూ ఉంటాడు అని చెప్పేది. నేను తన బాధ చూసి నీ లైఫ్ లోకి వచ్చి నీ బాధలు పోగొడతా అని చెప్పి ప్రపోజ్ చేసా దానికి తను ఒప్పుకుంది. నాకు కూడా 2019 లో విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చింది. అప్పటివరకు తన ఊరు గాని తన కాస్ట్ గాని నాకు తెలీదు. ఆశ్చర్యం ఏంటంటే తను కొత్తగూడెం లోనే ఉండేది అని నాకు అప్పటివరకు తెలియదు. నేను పోటీ పరీక్షలు కు సిద్ధం నిమిత్తం ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర చదివేవాడిని .
అందుకే వాళ్ళ గురించి సరిగ్గా తెలీలేదు. తను క్యాస్ట్ మాది ఒకటే. ఇంకా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే తన రాశి, నక్షత్రం , బ్లడ్ గ్రూప్ ,ఇద్దరం యెడమ చేతి వాటం వాళ్ళమే ఇలా అన్ని ఇద్దరివీ కూడా ఒకటే. తన ఇంజనీరింగ్ చదువు కోసం హైదరాబాద్ దగ్గర్లో ఉన్న "సంస్కృతి కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ" కాలేజి కి వెళ్లిపోయింది. ఆ నాలుగు సంవత్సరాలు నేను వాళ్ళ కాలేజీ కి వెళ్ళేవాడిని మరియు ఇద్దరం కలిసే వచ్చేవాల్లం వాళ్ళ హాస్టల్ వరకు వచ్చి దింపేసి నేనువెళ్ళేవాడిని. ఒకసారి మహబూబాబాద్ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి కూడా వెళ్తే తనకి తోడుగా వెళ్ళా. రోజు ఫోన్ మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం. నాకు ఒక వారంలో నైట్ డ్యూటీ ఉండేది. ఆ రాత్రి అంతా ఫోన్ మాట్లాడుకుంటునే ఉండేవాళ్ళం. నాల్గువ సంవత్సరం లో తన ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం 6 నెలలు హైదరాబాద్ లో ఒక కంపనీలో ట్రైనింగ్ చేసింది. నాకు ఆ నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలలా గడిచిపోయాయి. వాళ్ళ ఇంట్లో పెళ్లికోసం అడిగితే నాగురించి చెప్పింది. చిప్పిన తరువాత వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు మన ఇంటికి వచ్చి మాట్లాడమని చెప్పారు. అప్పటికి మా ఇంట్లో చెల్లికి సంబంధాలు చూస్తున్నారు. అందుకే చెల్లి పెళ్లి అయ్యేక వస్తం అని చెప్పాం.
వాళ్ళ ఇంట్లో దానికోసం తరుచూ గొడవలు అవుతునే ఉండేవి అందుకే గేట్ పరీక్ష కోచింగ్ కోసం మళ్ళి హైదరాబాద్ వచ్చేసింది. అది పూర్తి అయ్యాక వచ్చేసరికి చెల్లి పెళ్లి అయిపోయి, అన్నయ్య కూడా పెళ్లి సెట్ అయిపోయింది.ఆ లోపు వాళ్ళ బాబాయ్ నాతో మాట్లాడాలి అని వాళ్ళ అమ్మతో నాకు చెప్పించాడు. నేను,వాళ్ళ బాబాయ్ మరియు ఆ అమ్మాయి హైదరాబాద్ లో కలిశాం. వాళ్ళ బాబాయ్ నాతో పెళ్లి అమ్మాయి వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు అని చెప్పాడు. ఒక్కవేల పెళ్లి చేసుకున్న అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న మీ ఇంటికి రారు అంట అని చెప్పాడు. నేను అందరికీ ఇష్టం అయ్యాకే చేసుకుంటాం. అలా ఇష్టం లేకుండా చేసుకునే వాళ్ళమే అయితే ఈ మీటింగ్ కూడా అవసరం లేదు కదా అని అన్నాను.వాళ్ళ బాబాయ్ అవన్నీ నేను చుస్కుంటా మీరు ఎప్పుడు వస్తారు అని అడిగితే నేను 2 నెలల టైమ్ అడిగా. దానికి వాళ్ళ బాబాయ్ సరే ఇక నేను చూస్కుంటా. మీ పెళ్లి అయిపోయినట్టే అన్నాడు. ఆరోజు రాత్రికి మా ఇద్దరి సంతోషానికి అవధులు లేవు. రెండు నెలల తర్వాత మా ఇంట్లో వేరే సంబంధం వచ్చింది నాకు. నేను మా అమ్మతో అమ్మ నాకు తెల్సిన సంబంధం ఉంది వెళ్లి చూద్దాం అని చెప్పేసాను.అమ్మ వెంటనే అమ్మాయి వాళ్ళ డిటైల్స్ తీస్కుని ఒక పంతులు దగ్గరకి వెళ్ళింది . ఆ పంతులు అమ్మతో మా జాతకాలు చూసి వీళ్ళకి ముందే పరిచయం ఉంది అని చెప్పేశారు అంట.అప్పుడు పంతులు గారు ఆ అమ్మాయికి కూడా ఇంకో 2 నెలలలో రెవెన్యూ శాఖలో జాబ్ వస్తాది అని చెప్పారు అంట. అయితే ఇద్దరి జాతకాలు ఒకలానే ఉండడం వల్ల ఇద్దరం ఓకలానే ఆలోచిస్తారు అని చెప్పారట. మేము అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ నాన్న కూడా ఇంకో 4 నెలలలో పెళ్లి చేసేద్దాం అని చెప్పాడు. ఇక మద్యలో మూడం వచ్చేసింది.
ఆ అమ్మాయి కి నా పక్క village లోనే సర్వేయర్ జాబ్ వచ్చింది. ఒక నెల తరవాత పక్కింటి వాళ్ళను పంపి జాతకాలు చూపించాం. ఇద్దరి జాతకాలు కుదరలేవు మరియు బాగ జరగదు అని పంతులు చెప్పాడు. ఇక కాలమే నిర్ణయిస్తాది అని అనుకున్నాం. అప్పటివరకు ఏ అడ్డంకులు లేని నా జీవితం బరువనిపిచ్చింది. ఇక అప్పటి వరకు బానే ఉన్న మేము ఏం చెయ్యాలో తెలీలేదు అన్నట్టుగా ముఖం లో ప్రశ్నర్తకం మిగిలిపోయినది. మళ్లీ ఒక్కసారి పంతులు వెళ్దామా అని అమ్మ వాళ్ళు అడిగితే ఆ అమ్మాయి మా ఇంట్లో ఇక ఇష్టం లేదు అని కరాఖండూగా చెప్పేసారు. కానీ అమ్మాయి మాత్రం "నేనే ఏదోలా అయ్యేలా చూస్తా" అని భరోసా కల్పించింది. కొన్ని రోజులు అయ్యాక నాకో సంబంధం వచ్చింది చుస్కుని వెళ్లారు అంతే ఏం చెప్పలేదు లే అని అమ్మాయి చెప్పింది. కొన్ని రోజులు అయ్యాక సంబంధం ok అయ్యిందీ . పెళ్లి కొడుకు SI, వాళ్ళ అమ్మ నాన్న లు మీ అమ్మ నాన్న లానే చూస్తున్నారు నన్ను అని అమ్మాయి నాతో చెప్పింది. "అతను కూడా నీలానే ఆలోచిస్తున్నాడు" అని చెప్పింది. అప్పుడు నాకు అర్థమయ్యింది ఇక ఆ అమ్మాయి కి నేను అక్కర్లేదు అని. అనుకోకుండా వేరే పనిమీద వాళ్ళ ఇంటి పక్క నుండి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర చాలా కార్లు ఉన్నాయి ఎందుకా అని వేరే వాళ్ళని అడిగితే తన engagement అని తెలిసింది. అప్పుడు నాకు అర్థమయ్యింది ఎన్ని సంవత్సరాల ప్రేమ దగ్గర అయిన డబ్బు ఉంటే ఎందుకు పనికిరాదు అని. ఎలాంటి ప్రేమ కూడా డబ్బు ముందు తలవంచాల్సిందే అని అప్పడు అర్థం అయింది.
1 నెలలోనే వాడి గురించి వాళ్ళ ఫామిలీ గురించి తెలుసుకొని వాళ్ళతో కలిసి పొయిన్ది అంటే ఏమనుకోవాలి. నేను నా బాధ నీ అంతా ఒక మెసేజ్ గా పంపించాను. ఆ మెస్సేజ్ ని చూసుకొని కూడా దానికి రిప్లై ఇవ్వలేదు . నన్ను బ్లాక్ చేసేసింది .ఆ అమ్మాయి కి ఎంగేజ్మెంట్ అయ్యాక నాకు అమ్మాయి వైపు నుండి ఫోన్స్ వచ్చేవి మీ ఇద్దరు దిగిన ఫొటోస్ ఇస్తే మేము పెళ్లి ఆపేసి మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తామని చెప్పారు. కానీ దానికి నేను ఒప్పుకోలేదు. ఫోన్ ఎవరు చేశారో నేను గుర్తు పట్టలేదు మరియి వాళ్లెవరో ఇప్పటికీ నాకు తెలీలేదు. ఫైనల్ గా మొన్న lockdown లో తన పెళ్లి అయిపోయింది.
అందుకే ఫిక్స్ అయ్యా జీవితంలో ఎవర్ని సీరియస్ గా ప్రేమించకుడదు మరియు ఎవర్ని పెళ్లి చేసుకోకుడదు. 2 సంవత్సరాల ప్రేమ డబ్బుంటే ఇలా అణగారిపోతుందని తెల్సుంటే ముందే ప్రేమించక పోయేవాడిని. డబ్బు ఎలాంటి మంచివాళ్ళలో అయినా మార్పు తీసుకొస్తుంది అని తెల్సుకున్నా. 2 సంవత్సరాలు ప్రేమించుకున్నారు అంటే వీళ్ళ ఇద్దరిమధ్య ఏమి జరిగి ఉంటుందో అని కొంచెం అయినా వాళ్ళ నాన్న ఆలోచించి ఉంటె బాగుండేది. నాకు కూడా నెలకు 50 వేల జీతం మరియు ప్రభుత్వ ఉద్యోగం అది సరిపోదా వాళ్ళ అమ్మాయి నీ సంతోషంగా చూస్కోటానికి? ఇంత పకడ్బందీ ప్లాన్ తో నన్ను పక్కకి తప్పిస్తారు అని ముందే తెలిసుంటే అందరిలానే మేము లేచిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళం. ఈ నా కథ చదువుతున్న పిల్లల తల్లితండ్రులు మీరు ఏం చేయాలన్న చెయ్యండి కానీ చేసే ముందు ఒకసారి మీ కూతురు ఎక్కడ సంతోషంగా ఉంటుందో ఆలోచించండి . మీకు గౌరవం ఇచ్చి పెళ్లి విషయం మీకు చెప్తే ఆ గౌరవాన్ని నిలబెట్టుకొండి. నేను ప్రేమించిన అమ్మాయి బాగా ఉంటే నేను కూడా సంతోషం . అలా కాకుండా ఏదైనా తేడాగా జరిగితే మీరు బాధ పడాలి నేను కూడా బాధ పడాలి తను కూడా జీవితాంతం బాధ పడాలి.
ఇప్పుడు తన పెళ్లి అయ్యాక చూడాలనే అనిపించలేదు . తను డ్యూటీ నేను జాబ్ చేస్తున్న పక్క village లోనే చేస్తుంది. అందుకే తను కనిపిస్తుంది అని 2 నెలల నుండి జాబ్ కే వెళ్ళట్లేదు .తను చేసిన తప్పు ఏంటంటే ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా వేరే వాడ్ని ఒప్పుకోకుడదు. తను నా గురించి ఆలోచించకుండ నేను ఏమైనా పర్లేదు అని ఎవడ్నో పెళ్లి చేసేస్కుంది. ఈ నా కథలో వాళ్ళ నాన్న ది ఎంత తప్పు ఉందొ ఆ అమ్మాయి ది కూడా అంతే ఉంది. 2 సంవత్సరాలు love చేసిన అమ్మాయి మోసం చేసింది అనే భాధ ఎప్పటికి నా గుండెలో బాణిలిపోతూనే ఉంది మరియి న గుండెను కలిచి వస్తూనే ఉంది...😢😢😢😢